Bangaru Bathukamma Uyyalo Song
Telugu Lyrics
బంగారు బతుకమ్మ ఉయ్యాలో - తెలంగాణ బతుకమ్మ ఉయ్యాలో
ని సంబరాలు ఉయ్యాలో - మాకు వరహాలు ఉయ్యాలో ||2||
గడప గడపాకు ఉయ్యాలో - బందువైనవమ్మా ఉయ్యాలో
తడవ తడవాకు ఉయ్యాలో - మదిలోన మెరిసావు ఉయ్యాలో
గునుగు తామర ఉయ్యాలో- తంగేడు పువ్వులు ఉయ్యాలో
గుమ్మడి పువ్వులు ఉయ్యాలో - సప్త వర్ణంబులు ఉయ్యాలో ||2||
మట్టి నుండి మట్టికి ఉయ్యాలో - మర్మంబు తెలిపెను ఉయ్యాలో
ఆడపడుచులంతా ఉయ్యాలో - ఆనందవేళ ఉయ్యాలో
అందరు నీ వాళ్ళు ఉయ్యాలో - దీవించే బతుకమ్మ ఉయ్యాలో ||2||
మా బతులాకు ఉయ్యాలో - బందువైనవామ్మా ఉయ్యాలో
ఉద్యమాలకు ఉయ్యాలో - ఊపిరైనవమ్మా ఉయ్యాలో ||2||
కష్ట సుఖాలలో ఉయ్యాలో - పాటై నిలిచావు ఉయ్యాలో ||2||
బంగారు బతుకమ్మ ఉయ్యాలో - తెలంగాణ బతుకమ్మ ఉయ్యాలో ||2||
ని సంబరాలు ఉయ్యాలో - మాకు ఎంత వరహాలు ఉయ్యాలో ||2||
బంగారు బతుకమ్మ ఉయ్యాలో - తెలంగాణ బతుకమ్మ ఉయ్యాలో ||2||
ఏకమైతిమామ్మ ఉయ్యాలో - వెల్లువిరిసెనమ్మా ఉయ్యాలో
దుఃఖమూ మాపేటి ఉయ్యాలో - ధన్యరూపివమ్మా ఉయ్యాలో
నీవు లేనిదే ఉయ్యాలో - మేము లేవమ్మా ఉయ్యాలో
గుండె చప్పుడై ఉయ్యాలో - కొలువైనవమ్మ ఉయ్యాలో
గుండె చప్పుడై ఉయ్యాలో - కొలువై తీరవు ఉయ్యాలో
తెలంగాణ సంస్కృతి ఉయ్యాలో - చాటి చెప్పినావు ఉయ్యాలో
రంగు రంగుల పూలతో ఉయ్యాలో- నిన్ను కాస్తిమి ఉయ్యాలో
రంగు రంగుల పూలతో ఉయ్యాలో- నిన్ను కొలిచినాము ఉయ్యాలో


