Wednesday, 13 June 2018

Bangaru Bathukamma Uyyalo -Telangana Bathukamma Song - by Ammamma TV


Bangaru Bathukamma Uyyalo Song




telangana bathukamma



          Telugu Lyrics

బంగారు బతుకమ్మ ఉయ్యాలో -  తెలంగాణ బతుకమ్మ ఉయ్యాలో  

ని సంబరాలు  ఉయ్యాలో - మాకు వరహాలు ఉయ్యాలో                     ||2||

గడప గడపాకు ఉయ్యాలో - బందువైనవమ్మా ఉయ్యాలో

తడవ తడవాకు ఉయ్యాలో - మదిలోన మెరిసావు ఉయ్యాలో

గునుగు తామర ఉయ్యాలో- తంగేడు పువ్వులు ఉయ్యాలో

గుమ్మడి పువ్వులు ఉయ్యాలో - సప్త వర్ణంబులు  ఉయ్యాలో               ||2||

మట్టి నుండి మట్టికి ఉయ్యాలో - మర్మంబు తెలిపెను ఉయ్యాలో

ఆడపడుచులంతా ఉయ్యాలో - ఆనందవేళ ఉయ్యాలో

అందరు నీ వాళ్ళు ఉయ్యాలో - దీవించే బతుకమ్మ ఉయ్యాలో          ||2||

మా బతులాకు ఉయ్యాలో - బందువైనవామ్మా ఉయ్యాలో 

ఉద్యమాలకు ఉయ్యాలో - ఊపిరైనవమ్మా ఉయ్యాలో                        ||2||

కష్ట సుఖాలలో ఉయ్యాలో - పాటై నిలిచావు   ఉయ్యాలో                    ||2||

బంగారు బతుకమ్మ ఉయ్యాలో -  తెలంగాణ బతుకమ్మ ఉయ్యాలో   ||2||

ని సంబరాలు  ఉయ్యాలో - మాకు ఎంత  వరహాలు ఉయ్యాలో          ||2||

బంగారు బతుకమ్మ ఉయ్యాలో -  తెలంగాణ బతుకమ్మ ఉయ్యాలో   ||2||

ఏకమైతిమామ్మ ఉయ్యాలో - వెల్లువిరిసెనమ్మా ఉయ్యాలో

దుఃఖమూ మాపేటి ఉయ్యాలో - ధన్యరూపివమ్మా ఉయ్యాలో

నీవు లేనిదే ఉయ్యాలో - మేము లేవమ్మా ఉయ్యాలో

గుండె చప్పుడై ఉయ్యాలో - కొలువైనవమ్మ  ఉయ్యాలో

గుండె చప్పుడై ఉయ్యాలో - కొలువై తీరవు  ఉయ్యాలో

తెలంగాణ సంస్కృతి ఉయ్యాలో - చాటి చెప్పినావు ఉయ్యాలో

రంగు రంగుల పూలతో ఉయ్యాలో- నిన్ను కాస్తిమి  ఉయ్యాలో

రంగు రంగుల పూలతో ఉయ్యాలో- నిన్ను కొలిచినాము ఉయ్యాలో


For Audio click below







No comments:

Post a Comment