Tuesday, 9 November 2021

Sukravaram Lakshmi Telangana Bathukamma Song - written by Kaloji Narayana Rao - by Ammamma TV

09:27 0 Comments

  శుక్రవారం లక్ష్మి మా ఇంటికి వస్తే 



శుక్రవారం లక్ష్మి మా ఇంటికి వస్తే
 
కుంకుమ భరణితో నేను ఎదురుకుందు
 
శనివారం లక్ష్మి మా ఇంటికి వస్తే 

శెనగపూల రవికతో నేను ఎదురుకుందు 

ఆదివారం లక్ష్మి మా ఇంటికి వస్తే 

మల్లెపూల దండతో నేను ఎదురుకుందు 

సోమవారం లక్ష్మి మా ఇంటికి వస్తే 

సొమ్ములు పెట్టుకొని నేను ఎదురుకుందు 

బుధవారం లక్ష్మి మా ఇంటికి వస్తే 

బుక్కగుళాలతో నేను ఎదురుకుందు 

గురువారం లక్ష్మి మా ఇంటికి వస్తే 

గులాబీలతో నేను ఎదురుకుందు 

శుక్రవారం లక్ష్మి మా ఇంటికి వస్తే 

మా తల్లిదండ్రితో నేను ఎదురుకుందు 

శనివారం లక్ష్మి మా ఇంటికి వస్తే 

మా అత్తమామలతో నేను ఎదురుకుందు 

ఆదివారం లక్ష్మి మా ఇంటికి వస్తే 

అన్నావదినాలతో నేను ఎదురుకుందు 

సోమవారం లక్ష్మి మా ఇంటికి వస్తే 

మా అక్కబావ తో  తో నేను ఎదురుకుందు 

మంగళ వారం లక్ష్మి మా ఇంటికి వస్తే 

తమ్ముడు మరదలుతో నేను ఎదురుకుందు
 
బుధవారం లక్ష్మి మా ఇంటికి వస్తే 

బిడ్డలు అల్లుళ్లతో నేను ఎదురుకుందు 

గురువారం లక్ష్మి మా ఇంటికి వస్తే 

మా చెల్లెమరిదితో తో నేను ఎదురుకుందు



For Audio click below.





Thurpuna Vaanalu Uyyalo (Bathukamma Song) - by Ammamma TV

06:37 0 Comments

తూర్పున వానలు ఉయ్యాలో ....




తూర్పున వానలు ఉయ్యాలో ....

తుళ్ళి కొట్టంగ ఉయ్యాలో ....

పడమటి వానలు ఉయ్యాలో ....

పడి పడి కొట్టంగ ఉయ్యాలో ....

ఉత్తరాన వానలు ఉయ్యాలో ....

ఉరిమి కొట్టంగ ఉయ్యాలో ....

దక్షణాన వానలు ఉయ్యాలో ....

దంచి కొట్టంగ ఉయ్యాలో ....

ఆ వాన ఈ వాన ఉయ్యాలో ....

చెరువు నిండింది ఉయ్యాలో ....

ఆ ఊరి రాజైతే ఉయ్యాలో ....

కాంభోజ  రాజు ఉయ్యాలో ....

కాంభోజ  రాజుకు  ఉయ్యాలో ....

కనికరం లేదాయె ఉయ్యాలో ....

కట్ట తెగిపోయే ఉయ్యాలో ....

కానడమ్మ రాజు ఉయ్యాలో ....

చెరువు తెగిపోయే ఉయ్యాలో ....

జంకడమ్మ రాజు ఉయ్యాలో ....

గొర్ల మందనిస్త ఉయ్యాలో ....

కట్టని ఆపరాదా ఉయ్యాలో ....

గొర్ల మందలైతే ఉయ్యాలో ....

మాకు లెవా రాజా ఉయ్యాలో ....

బర్ల మందనిస్త ఉయ్యాలో ....

కట్టని ఆపరాదా ఉయ్యాలో ....

బర్ల మందలైతే ఉయ్యాలో ....

మాకు లెవా రాజా ఉయ్యాలో ....

ని పెద్ద కొడుకుని ఉయ్యాలో ....

హారమియ్యవు రాజా ఉయ్యాలో ....

పెద్ద కొడుకునిస్తే ఉయ్యాలో ....

పేరుకెవ్వరు లేరు ఉయ్యాలో ....

ని నడిపి కొడుకుని ఉయ్యాలో ....

హారమియ్యవు రాజా ఉయ్యాలో ....

నడిపి కొడుకునిస్తే ఉయ్యాలో ....

నాకు ఎవ్వరు లేరు ఉయ్యాలో ....

ని చిన్న కొడుకుని ఉయ్యాలో ....

హారమియ్యవు రాజా ఉయ్యాలో ....

చిన్న కొడుకునిస్తే ఉయ్యాలో ....

ముద్దుకేవ్వరు లేరు ఉయ్యాలో ....

ని పెద్ద కోడలిని ఉయ్యాలో ....

హారమియ్యవు రాజాఉయ్యాలో ....

పెద్ద కోడలినిస్తే ఉయ్యాలో ....

ప్రేమకెవ్వరు లేరు ఉయ్యాలో ....

ని నడిపి కోడలిని ఉయ్యాలో ....

హారమియ్యవు రాజా ఉయ్యాలో ....

నడిపి కోడలినిస్తే ఉయ్యాలో ....

నాదికెవ్వరు లేరు ఉయ్యాలో ....

ని చిన్న కోడలిని ఉయ్యాలో ....

హారమియ్యవు రాజా ఉయ్యాలో ....

పెట్టెల్లో సొమ్ములు ఉయ్యాలో ....

పెట్టుకో సీతమ్మ ఉయ్యాలో ....

పెట్టెల్లో చీరలు ఉయ్యాలో ....

కట్టుకో సీతమ్మ ఉయ్యాలో ....

కోమటక్కల్లారా ఉయ్యాలో ....

నీళ్లకొస్తారామ్మా ఉయ్యాలో ....

ఇప్పుడే తెచ్చినము ఉయ్యాలో ....

అగోవి బిందెలు ఉయ్యాలో ....

అగోవి బిందెలు ఉయ్యాలో ....

అగోవి చుట్టలు ఉయ్యాలో ....

బాపనక్కల్లారా ఉయ్యాలో ....

నీళ్లకొస్తారామ్మా ఉయ్యాలో ....

ఇప్పుడే తెచ్చినము ఉయ్యాలో ....

అగోవి బిందెలు ఉయ్యాలో ....

అగోవి చుట్టలు ఉయ్యాలో ....

పాయెనే సీతమ్మ ఉయ్యాలో ....

చెరువు దగ్గరకు ఉయ్యాలో ....

వేసేనే బిందెను ఉయ్యాలో ....

నీళ్ల తడవకు ఉయ్యాలో ....

అరికాళ్ళ మంట్టొచ్చే ఉయ్యాలో ....

బిందె మునగదు మామ ఉయ్యాలో ....

అసుంటా పోరాదు ఉయ్యాలో ....

అగ్గనాలున్నవి ఉయ్యాలో ....

పిక్కల్లా మంట్టొచ్చే ఉయ్యాలో ....
 
బిందె మునగదు మామ ఉయ్యాలో ....

అసుంటా పోరాదు ఉయ్యాలో ....

అగ్గనాలున్నవి ఉయ్యాలో ....

నడుముల్లా మంట్టొచ్చే ఉయ్యాలో ....

బిందె మునగదు మామఉయ్యాలో ....

అసుంటా పోరాదు ఉయ్యాలో ....

అగ్గనాలున్నవి ఉయ్యాలో ....

కడుపుల్ల మంట్టొచ్చే ఉయ్యాలో ....

బిందె మునగదు మామ ఉయ్యాలో ....

అసుంటా పోరాదు ఉయ్యాలో ....

అగ్గనాలున్నవి ఉయ్యాలో ....

సంకల్లా  మంట్టొచ్చే ఉయ్యాలో ....

బిందె మునగదు మామ ఉయ్యాలో ....

అసుంటా పోరాదు ఉయ్యాలో ....

అగ్గనాలున్నవి ఉయ్యాలో ....

తలమీద  మంట్టొచ్చే ఉయ్యాలో ....

బిందె మునగదు మామ ఉయ్యాలో ....

అసుంటా పోరాదు ఉయ్యాలో ....

అగ్గనాలున్నవి ఉయ్యాలో ....

ఆకాశం పొయెటి ఉయ్యాలో ....

హరి పక్షుల్లారా ఉయ్యాలో ....

మా అత్త మామలకు ఉయ్యాలో ....

కోడల్లేదని చెప్పు ఉయ్యాలో ....

ఆకాశం పొయెటి ఉయ్యాలో ....

హరి పక్షుల్లారా ఉయ్యాలో ....

మా అమ్మ నాన్నలకు ఉయ్యాలో ....

బిడ్డ లేదని చెప్పు ఉయ్యాలో ....

ఆకాశం పొయెటి ఉయ్యాలో ....

హరి పక్షుల్లారా ఉయ్యాలో ....

మా అన్నదమ్ములకు  ఉయ్యాలో ....

చెల్లె లేదని చెప్పు ఉయ్యాలో ....

ఆకాశం పొయెటి ఉయ్యాలో ....

హరి పక్షుల్లారా ఉయ్యాలో ....

మా మరిది లక్ష్మణుకి ఉయ్యాలో ....

వదిన లేదని చెప్పు ఉయ్యాలో ....

ఆకాశం పొయెటి ఉయ్యాలో ....

హరి పక్షుల్లారా ఉయ్యాలో ....

నా భర్త నాధునికి ఉయ్యాలో ....

భార్య లేదని ఉయ్యాలో ....

ఆకాశం పొయెటి ఉయ్యాలో ....

హరి పక్షుల్లారా ఉయ్యాలో ....

తొట్టెళ్ల బాలునికి ఉయ్యాలో .... 

తల్లి లేదని చెప్పు ఉయ్యాలో ...


 

For Audio click below.










































Krishnayya Valalo (Bathkamma Song) - by Ammamma TV

04:02 0 Comments

 కృష్ణయ్య వలలో... 



కస్తూరి వాడల్లో వలలో .....  
    
కృష్ణుడు ఎదురయే వలలో ..... 
     
రావే రావే గొల్లభామ వలలో .....  
    
రానన్న రావే వలలో .....
      
నేను రాను కృష్ణయ్య వలలో .....     

 మా అత్త తిడతాది వలలో .....      

మీ అత్త తిడితేను వలలో .....       

నను చూసుకుంటాను వలలో .....     
 
లక్ష వరహాలు వలలో .....        

నీకు ఇస్తా రావే వలలో .....      

నా ముత్హుటుంగరము  వలలో .....       

నీకు ఇస్తా రావే వలలో .....      

మూసి మూసి నవ్వులతో వలలో .....      

 వచ్చే గొల్లభామ వలలో .....   

ఆకలాయె వేళాయె వలలో .....   
     
అమ్మ జాడలకు వలలో .....   
   
కళకు నీళ్లిచ్చి వలలో .....      
     
కలియపార చూసే వలలో .....    
  
ని    ముత్హుటుంగరము  వలలో .....  
         
ఏదిరా కృష్ణయ్య వలలో .....  
         
పాలు పిండపోతే వలలో .....    
        
పాలళ్ల పడెనేమో వలలో .....     
      
పట్టు బట్ట తెచ్చి వలలో .....    
        
పాలన్నీ వడబోసే వలలో .....      
     
ఇళ్ల లేదు కృష్ణయ్య వలలో .....          
 
మాయదారి క్రిష్నయ్య వలలో .....   
        
చల్ల చేయబోతే వలలో .....        
   
చల్లలా పడెనేమో వలలో .....       
    
సైను బట్ట తెచ్చి వలలో .....        
   
చల్లంత వడబోసే వలలో .....    
       
ఇళ్ల లేదు కృష్ణ వలలో .....           

 మాయదారి కృష్ణ వలలో .....      
     
బట్టలు ఉతకబోతే వలలో .....           
బాయిల పడెనేమో 

బాయిల నీళ్ళని వలలో .....      
      
బండ్లల్ల పోసింది వలలో .....     
      
ఇళ్ల లేదు కృష్ణ వలలో .....     
       
మాయదారి కృష్ణ వలలో .....     
      
పెరుగు అమ్మపోతే వలలో .....    
     
పెరుగుల పడెనేమో వలలో .....     
      
పెరుగు దుత్త తెచ్చి వలలో .....        
   
పెరుగు అంత వడబోసే వలలో .....   
        
ఇళ్ల లేదు కృష్ణ వలలో .....            

మాయదారి కృష్ణ వలలో .....    
     
చేల్లలు ఉతకబోతే వలలో .....   
       
చెరువుల పడెనేమో వలలో .....    
      
చెరువుల్లో నీళ్లన్నీ వలలో .....   
      
 చెట్లకు పొసే వలలో .....      
    
 ఇళ్ల లేదు కృష్ణ వలలో .....     
       
మాయదారి కృష్ణ వలలో .....  

గొల్ల దాన్ని తెచ్చి  వలలో .....     
       
బండపై నిలబెట్టి వలలో .....        
    
కిందగా వాతలు వలలో .....           
 
పైనంగా బొబ్బలు వలలో .....      
      
కాపాడు కృష్ణయ్య వలలో .....         
   
మాయదారి కృష్ణయ్య వలలో .....    
        
మూసి మూసి నవ్వులతో వలలో .....    
       
 కాపాడే కృష్ణయ్య వలలో .....            


  

For Audio click below.



Pasupula Puttu (Bathukamma Song) - by Ammamma TV

01:31 0 Comments

పసుపుల పుట్టు గౌరమ్మ  

పసుపుల పుట్టు గౌరమ్మ...     
పసుపుల పెరుగు గౌరమ్మ…
శ్రీమంతుని ఇంట్లో పుట్టి...     
శ్రీమంతుని ఇంట్లో పెరిగి...
విదియ అట్లా తదియ నాడు...  
కాంతలు అందరు చేరి 
గన్నేరు పువ్వులు తెచ్చి...     
బతుకమ్మనే  పేర్చి...
వత్తీ పత్తీ ని పేర్చి...          
వడి బియ్యమే పోసి... 
మాయమ్మ లక్ష్మి దేవి పోయిరావమ్మ  
మా తల్లి లక్ష్మి దేవి మళ్ళి రావమ్మ 
పోయి మీఅత్త ఇంట్లో బుద్ది కల్గి ఉండు
ఎవ్వరు ఎం అన్నానుఎదురాడకమ్మా
అదిరి అదిరి నడవబోకు...    
ధరణి దేవి అదిరేనమ్మా... 
మీ మామ మీ నాన్న కి ...    
మేనత్తకొడుకే కాస మేరాతప్పి తిరగబోకు... 
 పైన  ఉన్న పైట చెంగు...    
జార విడిచి నడవబోకు... 
వీదిన నిలబడి కురులు ఇప్పకు 
ఇరుగు వారు నవ్వేరమ్మ...
పొరుగువారు నవ్వేరమ్మ...     
రచ్చ వారు  నవ్వేరమ్మ...
పాటించిన దీపావళి ...        
పండుగ పదినాళ్ళుంది...
నాటికి తోలుకవద్దు...          
కాటుక కాయలిద్దు...
కుంకుమ భరణిలిద్దు...        
పడకటింటికి అందమైన...
పట్టె మంచం పాన్పునిద్దు...  
ఎక్కేటి గుర్రానిద్దు...
యేలాటి రాజ్యానిద్దు...         
నీకు నచ్చిన చీరనిద్దు...    
నీలాల  కమ్మలు పెడుదు...    
పాడికి ఆవులనిద్దు...      
పాడికి ఆవులనిద్దు...           
కూర్చుండ పీటలిద్దు...
 మాయమ్మ లక్ష్మి దేవి పోయిరావమ్మ ...  
మా తల్లి లక్ష్మి దేవి మళ్ళి రావమ్మ
రాజా వీధుల లక్ష్మి దేవి చెప్ప వచ్చింది ...
కట్నం ఇద్దాం అంటే కమలాక్షి నీకు
చీరాళ్లకల్లా నీకు ఏ చీర ఘనము ...    
పచ్చ పట్టు చీర పణతి కి అందంబు 
ఎర్ర పట్టు చీర వెలతికి అందంబు  ...  
నల్ల పట్టు చీర నాతికి అందంబు 
పెద్దింటి అన్నయ్య పోయి వచ్చెదను...  
పోయిరా నాతల్లి చాల దయనుంచు 
రెండింటి అన్నయ్య పోయి వచ్చెదను ...
పోయిరా నాతల్లి చాల దయనుంచు 
ముడింటి అన్నయ్య పోయి వచ్చెదను ...
ముద్దుల సుందరి పోయిరావమ్మ 
నాలుగింటి అన్నయ్య పోయి వచ్చెదను...
నవ్వులసుందరి పోయిరావమ్మ 
ఐదింటి అన్నయ్య పోయి వచ్చెదను  ...
అందాల సుందరి పోయిరావమ్మ 
ఆరింటి అన్నయ్య పోయి వచ్చెదను ...  
అన్నలకు చెల్లలివి పోయిరావమ్మ 
ఏడింటి అన్నయ్య పోయి వచ్చెదను...  
ఏడవకు నాతల్లి పోయిరావమ్మ
పెద్దింటి వదినమ్మ పోయి వచ్చెదను ...  
వదినలకు మరదలివి పోయిరావమ్మ
ఏడింటి వదినమ్మ పోయి వచ్చెదను  ...  
ఇంకేమి కావాలి  ఇంటి ఆడబిడ్డ
కొయ్యకొడవలి చిక్కే కుంటిఎద్దు చిక్కే...
మూలవాసము చిక్కే ముసలిఎద్దు చిక్కే
 చిపిరి కట్టైనా దక్కనిచ్చేవా ...      
చూసావా చిన్నఅన్న చిన్నవదిన మాట 
ఎంత మాటాడేరా అన్నయ్య నన్ను...  
ఎంత మాటాడేరా అన్నయ్య నన్ను
కొన్న కోడలి తోటి మనకేంటి చెల్లి...    
మూడువేల జనంబు ముందట వస్తుంటే 
ఏడువేల  జనంబు యెనక వస్తుంటే...
నాలుగువేల జనంబు నడుమ వస్తుంటే 
ఏడుగురు అన్నలు యెంట  వస్తుంటే...  
ఏడుగురు వదినలుయెంట వస్తుంటే  
పచ్చని పల్లకి పయనమయ్యింది...
పల్లకి తో పసుపు తోట కదిలింది  
పచ్చని పల్లకి ఎక్కినా శ్రీ లక్ష్మి అత్తిల్లు తావాయెను 
పచ్చని పల్లకి ఎక్కినా శ్రీ లక్ష్మి అత్తిల్లు తావాయెను  తాను అత్తిల్లు తావాయెను.


For Audio click below.