తూర్పున వానలు ఉయ్యాలో ....
తూర్పున వానలు ఉయ్యాలో ....
తుళ్ళి కొట్టంగ ఉయ్యాలో ....
పడమటి వానలు ఉయ్యాలో ....
పడి పడి కొట్టంగ ఉయ్యాలో ....
ఉత్తరాన వానలు ఉయ్యాలో ....
ఉరిమి కొట్టంగ ఉయ్యాలో ....
దక్షణాన వానలు ఉయ్యాలో ....
దంచి కొట్టంగ ఉయ్యాలో ....
ఆ వాన ఈ వాన ఉయ్యాలో ....
చెరువు నిండింది ఉయ్యాలో ....
ఆ ఊరి రాజైతే ఉయ్యాలో ....
కాంభోజ రాజు ఉయ్యాలో ....
కాంభోజ రాజుకు ఉయ్యాలో ....
కనికరం లేదాయె ఉయ్యాలో ....
కట్ట తెగిపోయే ఉయ్యాలో ....
కానడమ్మ రాజు ఉయ్యాలో ....
చెరువు తెగిపోయే ఉయ్యాలో ....
జంకడమ్మ రాజు ఉయ్యాలో ....
గొర్ల మందనిస్త ఉయ్యాలో ....
కట్టని ఆపరాదా ఉయ్యాలో ....
గొర్ల మందలైతే ఉయ్యాలో ....
మాకు లెవా రాజా ఉయ్యాలో ....
బర్ల మందనిస్త ఉయ్యాలో ....
కట్టని ఆపరాదా ఉయ్యాలో ....
బర్ల మందలైతే ఉయ్యాలో ....
మాకు లెవా రాజా ఉయ్యాలో ....
ని పెద్ద కొడుకుని ఉయ్యాలో ....
హారమియ్యవు రాజా ఉయ్యాలో ....
పెద్ద కొడుకునిస్తే ఉయ్యాలో ....
పేరుకెవ్వరు లేరు ఉయ్యాలో ....
ని నడిపి కొడుకుని ఉయ్యాలో ....
హారమియ్యవు రాజా ఉయ్యాలో ....
నడిపి కొడుకునిస్తే ఉయ్యాలో ....
నాకు ఎవ్వరు లేరు ఉయ్యాలో ....
ని చిన్న కొడుకుని ఉయ్యాలో ....
హారమియ్యవు రాజా ఉయ్యాలో ....
చిన్న కొడుకునిస్తే ఉయ్యాలో ....
ముద్దుకేవ్వరు లేరు ఉయ్యాలో ....
ని పెద్ద కోడలిని ఉయ్యాలో ....
హారమియ్యవు రాజాఉయ్యాలో ....
పెద్ద కోడలినిస్తే ఉయ్యాలో ....
ప్రేమకెవ్వరు లేరు ఉయ్యాలో ....
ని నడిపి కోడలిని ఉయ్యాలో ....
హారమియ్యవు రాజా ఉయ్యాలో ....
నడిపి కోడలినిస్తే ఉయ్యాలో ....
నాదికెవ్వరు లేరు ఉయ్యాలో ....
ని చిన్న కోడలిని ఉయ్యాలో ....
హారమియ్యవు రాజా ఉయ్యాలో ....
పెట్టెల్లో సొమ్ములు ఉయ్యాలో ....
పెట్టుకో సీతమ్మ ఉయ్యాలో ....
పెట్టెల్లో చీరలు ఉయ్యాలో ....
కట్టుకో సీతమ్మ ఉయ్యాలో ....
కోమటక్కల్లారా ఉయ్యాలో ....
నీళ్లకొస్తారామ్మా ఉయ్యాలో ....
ఇప్పుడే తెచ్చినము ఉయ్యాలో ....
అగోవి బిందెలు ఉయ్యాలో ....
అగోవి బిందెలు ఉయ్యాలో ....
అగోవి చుట్టలు ఉయ్యాలో ....
బాపనక్కల్లారా ఉయ్యాలో ....
నీళ్లకొస్తారామ్మా ఉయ్యాలో ....
ఇప్పుడే తెచ్చినము ఉయ్యాలో ....
అగోవి బిందెలు ఉయ్యాలో ....
అగోవి చుట్టలు ఉయ్యాలో ....
పాయెనే సీతమ్మ ఉయ్యాలో ....
చెరువు దగ్గరకు ఉయ్యాలో ....
వేసేనే బిందెను ఉయ్యాలో ....
నీళ్ల తడవకు ఉయ్యాలో ....
అరికాళ్ళ మంట్టొచ్చే ఉయ్యాలో ....
బిందె మునగదు మామ ఉయ్యాలో ....
అసుంటా పోరాదు ఉయ్యాలో ....
అగ్గనాలున్నవి ఉయ్యాలో ....
పిక్కల్లా మంట్టొచ్చే ఉయ్యాలో ....
బిందె మునగదు మామ ఉయ్యాలో ....
అసుంటా పోరాదు ఉయ్యాలో ....
అగ్గనాలున్నవి ఉయ్యాలో ....
నడుముల్లా మంట్టొచ్చే ఉయ్యాలో ....
బిందె మునగదు మామఉయ్యాలో ....
అసుంటా పోరాదు ఉయ్యాలో ....
అగ్గనాలున్నవి ఉయ్యాలో ....
కడుపుల్ల మంట్టొచ్చే ఉయ్యాలో ....
బిందె మునగదు మామ ఉయ్యాలో ....
అసుంటా పోరాదు ఉయ్యాలో ....
అగ్గనాలున్నవి ఉయ్యాలో ....
సంకల్లా మంట్టొచ్చే ఉయ్యాలో ....
బిందె మునగదు మామ ఉయ్యాలో ....
అసుంటా పోరాదు ఉయ్యాలో ....
అగ్గనాలున్నవి ఉయ్యాలో ....
తలమీద మంట్టొచ్చే ఉయ్యాలో ....
బిందె మునగదు మామ ఉయ్యాలో ....
అసుంటా పోరాదు ఉయ్యాలో ....
అగ్గనాలున్నవి ఉయ్యాలో ....
ఆకాశం పొయెటి ఉయ్యాలో ....
హరి పక్షుల్లారా ఉయ్యాలో ....
మా అత్త మామలకు ఉయ్యాలో ....
కోడల్లేదని చెప్పు ఉయ్యాలో ....
ఆకాశం పొయెటి ఉయ్యాలో ....
హరి పక్షుల్లారా ఉయ్యాలో ....
మా అమ్మ నాన్నలకు ఉయ్యాలో ....
బిడ్డ లేదని చెప్పు ఉయ్యాలో ....
ఆకాశం పొయెటి ఉయ్యాలో ....
హరి పక్షుల్లారా ఉయ్యాలో ....
మా అన్నదమ్ములకు ఉయ్యాలో ....
చెల్లె లేదని చెప్పు ఉయ్యాలో ....
ఆకాశం పొయెటి ఉయ్యాలో ....
హరి పక్షుల్లారా ఉయ్యాలో ....
మా మరిది లక్ష్మణుకి ఉయ్యాలో ....
వదిన లేదని చెప్పు ఉయ్యాలో ....
ఆకాశం పొయెటి ఉయ్యాలో ....
హరి పక్షుల్లారా ఉయ్యాలో ....
నా భర్త నాధునికి ఉయ్యాలో ....
భార్య లేదని ఉయ్యాలో ....
ఆకాశం పొయెటి ఉయ్యాలో ....
హరి పక్షుల్లారా ఉయ్యాలో ....
తొట్టెళ్ల బాలునికి ఉయ్యాలో ....
తల్లి లేదని చెప్పు ఉయ్యాలో ...


No comments:
Post a Comment