పసుపుల పుట్టు గౌరమ్మ
పసుపుల పుట్టు గౌరమ్మ...
పసుపుల పెరుగు గౌరమ్మ…
శ్రీమంతుని ఇంట్లో పుట్టి...
శ్రీమంతుని ఇంట్లో పెరిగి...
విదియ అట్లా తదియ నాడు...
కాంతలు అందరు చేరి
గన్నేరు పువ్వులు తెచ్చి...
బతుకమ్మనే పేర్చి...
వత్తీ పత్తీ ని పేర్చి...
వడి బియ్యమే పోసి...
మాయమ్మ లక్ష్మి దేవి పోయిరావమ్మ
మా తల్లి లక్ష్మి దేవి మళ్ళి రావమ్మ
పోయి మీఅత్త ఇంట్లో బుద్ది కల్గి ఉండు
ఎవ్వరు ఎం అన్నానుఎదురాడకమ్మా
అదిరి అదిరి నడవబోకు...
ధరణి దేవి అదిరేనమ్మా...
మీ మామ మీ నాన్న కి ...
మేనత్తకొడుకే కాస మేరాతప్పి తిరగబోకు...
పైన ఉన్న పైట చెంగు...
జార విడిచి నడవబోకు...
వీదిన నిలబడి కురులు ఇప్పకు
ఇరుగు వారు నవ్వేరమ్మ...
పొరుగువారు నవ్వేరమ్మ...
రచ్చ వారు నవ్వేరమ్మ...
పాటించిన దీపావళి ...
పండుగ పదినాళ్ళుంది...
నాటికి తోలుకవద్దు...
కాటుక కాయలిద్దు...
కుంకుమ భరణిలిద్దు...
పడకటింటికి అందమైన...
పట్టె మంచం పాన్పునిద్దు...
ఎక్కేటి గుర్రానిద్దు...
యేలాటి రాజ్యానిద్దు...
నీకు నచ్చిన చీరనిద్దు...
నీలాల కమ్మలు పెడుదు...
పాడికి ఆవులనిద్దు...
పాడికి ఆవులనిద్దు...
కూర్చుండ పీటలిద్దు...
మాయమ్మ లక్ష్మి దేవి పోయిరావమ్మ ...
మా తల్లి లక్ష్మి దేవి మళ్ళి రావమ్మ
రాజా వీధుల లక్ష్మి దేవి చెప్ప వచ్చింది ...
కట్నం ఇద్దాం అంటే కమలాక్షి నీకు
చీరాళ్లకల్లా నీకు ఏ చీర ఘనము ...
పచ్చ పట్టు చీర పణతి కి అందంబు
ఎర్ర పట్టు చీర వెలతికి అందంబు ...
నల్ల పట్టు చీర నాతికి అందంబు
పెద్దింటి అన్నయ్య పోయి వచ్చెదను...
పోయిరా నాతల్లి చాల దయనుంచు
రెండింటి అన్నయ్య పోయి వచ్చెదను ...
పోయిరా నాతల్లి చాల దయనుంచు
ముడింటి అన్నయ్య పోయి వచ్చెదను ...
ముద్దుల సుందరి పోయిరావమ్మ
నాలుగింటి అన్నయ్య పోయి వచ్చెదను...
నవ్వులసుందరి పోయిరావమ్మ
ఐదింటి అన్నయ్య పోయి వచ్చెదను ...
అందాల సుందరి పోయిరావమ్మ
ఆరింటి అన్నయ్య పోయి వచ్చెదను ...
అన్నలకు చెల్లలివి పోయిరావమ్మ
ఏడింటి అన్నయ్య పోయి వచ్చెదను...
ఏడవకు నాతల్లి పోయిరావమ్మ
పెద్దింటి వదినమ్మ పోయి వచ్చెదను ...
వదినలకు మరదలివి పోయిరావమ్మ
ఏడింటి వదినమ్మ పోయి వచ్చెదను ...
ఇంకేమి కావాలి ఇంటి ఆడబిడ్డ
కొయ్యకొడవలి చిక్కే కుంటిఎద్దు చిక్కే...
మూలవాసము చిక్కే ముసలిఎద్దు చిక్కే
చిపిరి కట్టైనా దక్కనిచ్చేవా ...
చూసావా చిన్నఅన్న చిన్నవదిన మాట
ఎంత మాటాడేరా అన్నయ్య నన్ను...
ఎంత మాటాడేరా అన్నయ్య నన్ను
కొన్న కోడలి తోటి మనకేంటి చెల్లి...
మూడువేల జనంబు ముందట వస్తుంటే
ఏడువేల జనంబు యెనక వస్తుంటే...
నాలుగువేల జనంబు నడుమ వస్తుంటే
ఏడుగురు అన్నలు యెంట వస్తుంటే...
ఏడుగురు వదినలుయెంట వస్తుంటే
పచ్చని పల్లకి పయనమయ్యింది...
పల్లకి తో పసుపు తోట కదిలింది
పచ్చని పల్లకి ఎక్కినా శ్రీ లక్ష్మి అత్తిల్లు తావాయెను
పచ్చని పల్లకి ఎక్కినా శ్రీ లక్ష్మి అత్తిల్లు తావాయెను తాను అత్తిల్లు తావాయెను.
For Audio click below.


No comments:
Post a Comment