కృష్ణయ్య వలలో...
కస్తూరి వాడల్లో వలలో .....
కృష్ణుడు ఎదురయే వలలో .....
రావే రావే గొల్లభామ వలలో .....
రానన్న రావే వలలో .....
నేను రాను కృష్ణయ్య వలలో .....
మా అత్త తిడతాది వలలో .....
మీ అత్త తిడితేను వలలో .....
నను చూసుకుంటాను వలలో .....
లక్ష వరహాలు వలలో .....
నీకు ఇస్తా రావే వలలో .....
నా ముత్హుటుంగరము వలలో .....
నీకు ఇస్తా రావే వలలో .....
మూసి మూసి నవ్వులతో వలలో .....
వచ్చే గొల్లభామ వలలో .....
ఆకలాయె వేళాయె వలలో .....
అమ్మ జాడలకు వలలో .....
కళకు నీళ్లిచ్చి వలలో .....
కలియపార చూసే వలలో .....
ని ముత్హుటుంగరము వలలో .....
ఏదిరా కృష్ణయ్య వలలో .....
పాలు పిండపోతే వలలో .....
పాలళ్ల పడెనేమో వలలో .....
పట్టు బట్ట తెచ్చి వలలో .....
పాలన్నీ వడబోసే వలలో .....
ఇళ్ల లేదు కృష్ణయ్య వలలో .....
మాయదారి క్రిష్నయ్య వలలో .....
చల్ల చేయబోతే వలలో .....
చల్లలా పడెనేమో వలలో .....
సైను బట్ట తెచ్చి వలలో .....
చల్లంత వడబోసే వలలో .....
ఇళ్ల లేదు కృష్ణ వలలో .....
మాయదారి కృష్ణ వలలో .....
బట్టలు ఉతకబోతే వలలో .....
బాయిల పడెనేమో
బాయిల నీళ్ళని వలలో .....
బండ్లల్ల పోసింది వలలో .....
ఇళ్ల లేదు కృష్ణ వలలో .....
మాయదారి కృష్ణ వలలో .....
పెరుగు అమ్మపోతే వలలో .....
పెరుగుల పడెనేమో వలలో .....
పెరుగు దుత్త తెచ్చి వలలో .....
పెరుగు అంత వడబోసే వలలో .....
ఇళ్ల లేదు కృష్ణ వలలో .....
మాయదారి కృష్ణ వలలో .....
చేల్లలు ఉతకబోతే వలలో .....
చెరువుల పడెనేమో వలలో .....
చెరువుల్లో నీళ్లన్నీ వలలో .....
చెట్లకు పొసే వలలో .....
ఇళ్ల లేదు కృష్ణ వలలో .....
మాయదారి కృష్ణ వలలో .....
గొల్ల దాన్ని తెచ్చి వలలో .....
బండపై నిలబెట్టి వలలో .....
కిందగా వాతలు వలలో .....
పైనంగా బొబ్బలు వలలో .....
కాపాడు కృష్ణయ్య వలలో .....
మాయదారి కృష్ణయ్య వలలో .....
మూసి మూసి నవ్వులతో వలలో .....
కాపాడే కృష్ణయ్య వలలో .....


No comments:
Post a Comment