Thursday, 30 September 2021

Iddaru Akka Chellelu Uyyaaloo (Bathukamma Song) - by Ammamma TV

04:32 0 Comments

 ఇద్దరు అక్క చెల్లెల్లు ఉయ్యాలో.


ఇద్దరు అక్క చెల్లెల్లు ఉయ్యాలో    

ఒక్క ఊరికి ఇచ్చే ఉయ్యాలో  

 

ఒక్కడే మా అన్న ఉయ్యాలో        

వచ్చన్న పోడు ఉయ్యాలో  

 

ఎట్లోత్తు చెల్లెలా ఉయ్యాలో        

ఎరడ్డామాయే ఉయ్యాలో    


ఏరుకి ఎంపళ్ళు ఉయ్యాలో        

తలుపులడ్డామయే ఉయ్యాలో


తలుపులకి తాళాలు ఉయ్యాలో     

వెండి సిలాలు ఉయ్యాలో    

  

వెండి శిలలా కింద ఉయ్యాలో        

వెలపత్తి  చెట్టు ఉయ్యాలో

    

వెలపత్తి చెట్టుకి ఉయ్యాలో         

ఏడే గింజలు ఉయ్యాలో  

  

ఏడు గింజల పత్తి ఉయ్యాలో        

తక్కెడు  పత్తి  ఉయ్యాలో     


ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో          

తక్కెడు పత్తి ఉయ్యాలో     


పాల పాల పత్తి ఉయ్యాలో            

పావురాళ్ల పత్తి ఉయ్యాలో     


ముసల్ది  వడికింది ఉయ్యాలో        

ముత్యాల పత్తి ఉయ్యాలో    


వయసమ్మ వడికింది ఉయ్యాలో    

వన్నెల పత్తి ఉయ్యాలో   


చిన్నారి  వడికింది ఉయ్యాలో        

చిన్నెల పత్తి ఉయ్యాలో


బాలింత వడికింది ఉయ్యాలో        

బంగారు  పత్తి ఉయ్యాలో  


ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో          

సాలోనికి ఇచ్చెనే ఉయ్యాలో


సంగడి సారన్నాఉయ్యాలో          

సాగదియ్యబట్టే ఉయ్యాలో      


నేసెనమ్మా సాలోడు ఉయ్యాలో    

నెలకొక్క పోగు ఉయ్యాలో 


దిగేనమ్మా ఆ చీర ఉయ్యాలో    

దివిటీల మీద ఉయ్యాలో  


ఆ చీర కట్టుక ఉయ్యాలో            

కొంగళ్ల బాయికి ఉయ్యాలో      


కొంగళ్ల బాయికి ఉయ్యాలో            

నీళ్లకెళ్లినది ఉయ్యాలో    


కొంగళ్ళన్నీ గూడి ఉయ్యాలో        

కొంగు అంత చింపెను ఉయ్యాలో    


ఆ చీర కట్టుక ఉయ్యాలో              

హంసల్లా బాయికి ఉయ్యాలో    


హంసల్లా  బాయికి ఉయ్యాలో         

నీళ్లకెళ్లినాది ఉయ్యాలో     


హంసలన్నీ గూడి ఉయ్యాలో        

అంచు అంత దూసెను ఉయ్యాలో     


ఆ చీర కట్టుక ఉయ్యాలో            

చిలకల బాయికి ఉయ్యాలో   


చిలకల బాయికి ఉయ్యాలో            

నీళ్లకెళ్లినది ఉయ్యాలో     


చిలకలన్నీ గూడి ఉయ్యాలో        

చింగులన్నీ చింపే ఉయ్యాలో        


ఆ చీర కట్టుక ఉయ్యాలో             

పట్నంబు పోయెనే ఉయ్యాలో


పట్నంబు  పాయెనే ఉయ్యాలో        

కొంగు బంగారము ఉయ్యాలో        


దిగేనమ్మా ఆ చీర ఉయ్యాలో    

దివిటీల మీద ఉయ్యాలో


అన్నరా ఓయన్న ఉయ్యాలో      

అన్నరా పెద్దన్న ఉయ్యాలో         


ఏడాదికి ఓసారి ఉయ్యాలో            

బతుకమ్మ పండగ ఉయ్యాలో 


ఆడపిల్లని అన్న ఉయ్యాలో        

మరువకు ఓయన్న ఉయ్యాలో    

     

కల్గెనే పెద్దన్న ఉయ్యాలో      

కన్న  తల్లివోలె ఉయ్యాలో     


ఏడంత్రాలదే     ఉయ్యాలో        

తీరైన బతుకమ్మ ఉయ్యాలో       


తీరైన బతుకమ్మ ఉయ్యాలో       

పువ్వులెన్నో తెచ్చి ఉయ్యాలో        


వారిద్దరూ ఉన్నారా ఉయ్యాలో    

వీరిద్దరూ ఉన్నారా ఉయ్యాలో       


సంవత్సరానికి ఉయ్యాలో  

ఒక్కసారే తల్లి ఉయ్యాలో  

     

తంగేడి పువ్వుల్ని ఉయ్యాలో  

రాశిగా తెప్పించి ఉయ్యాలో   


ఏడంత్రాలదే ఉయ్యాలో        

తీరైన బతుకమ్మ ఉయ్యాలో …


పోయిరా  బతుకమ్మ ఉయ్యాలో      

పోయిరావమ్మ ఉయ్యాలో  


మల్లి ఏడాదికి ఉయ్యాలో  

మళ్లిరావమ్మా ఉయ్యాలో  



For Audio click below.





Monday, 6 September 2021

Rama Rama Uayyalo - Bathukamma Song - by AmmammaTV

10:48 0 Comments

రామ రామ రామ ఉయ్యాలో


రామ రామ రామ  ఉయ్యాలో                                రామనే శ్రీరామ ఉయ్యాలో 

ముందుగా నిను తలుదు ఉయ్యాలో                      ముత్యాల పోచమ్మ ఉయ్యాలో 

తరువాత నిను తలుదు ఉయ్యాలో                               తల్లిరో పెద్దమ్మ ఉయ్యాలో 


ఆదిలో నిను తలుదు ఉయ్యాలో                                   అయినోళ్ల మల్లన్న ఉయ్యాలో 


కోరుత నిను తలుదు ఉయ్యాలో                                    కొమరెల్లి మల్లన్న ఉయ్యాలో 


మారుగా  నిను తలుదు ఉయ్యాలో                                మావురాళ్ళ ఎల్లమ్మా ఉయ్యాలో 


భోగాన నిను తలుదు ఉయ్యాలో                                   బొంతపల్లి వీరన్న ఉయ్యాలో 


శరణాన్న వరంగల్లు ఉయ్యాలో                                     శంభుడా  నిను తలుదు ఉయ్యాలో


రామ రామ ఉయ్యాలో                                                   రామనే శ్రీరామ ఉయ్యాలో 


తొక్కుదును భూదేవి  ఉయ్యాలో                                    మొక్కుదును నేనిన్ను ఉయ్యాలో 


బాధల్లా నిను తలుదు ఉయ్యాలో                                   భద్రాద్రి రామన్నా ఉయ్యాలో 


గుండెల్లో  నిను తలుదు ఉయ్యాలో                                కొండగట్టు అంజన్న ఉయ్యాలో 


ఎప్పుడు నిను తలుదు ఉయ్యాలో                                 వేములాడ రాజన్న ఉయ్యాలో 


యాదిలో నిను తలుదు ఉయ్యాలో                                యాదగిరి నరసన్న ఉయ్యాలో 


సమ్మక్క సారక్క ఉయ్యాలో                                           కీర్తిగా నిను తలుదు ఉయ్యాలో  

     

కీర్తిగా నిను తలుదు ఉయ్యాలో                                       కీసర రామన్న ఉయ్యాలో 


రామ రామ రామ  ఉయ్యాలో                                          రామనే శ్రీరామ ఉయ్యాలో 


శ్రీరామ జయ రామ ఉయ్యాలో                                       కోదండ రామ ఉయ్యాలో’


అందరిని తలచితి ఉయ్యాలో                                       గంగ నిను మరచితి ఉయ్యాలో 


గంగ నిను తలవంది ఉయ్యాలో                                     గడియ నిలువలెను ఉయ్యాలో 


మెతుకు చెట్టు కింద ఉయ్యాలో                                     పుట్టినావే గంగ ఉయ్యాలో 


మలమంటి కాలువలు ఉయ్యాలో                                  పారినవే గంగ ఉయ్యాలో 


తంగేడు చెట్టు కింద ఉయ్యాలో                                     పుట్టినావే గంగ ఉయ్యాలో 


తల్లేడు  కాలువలు ఉయ్యాలో                                       పారినవే గంగ ఉయ్యాలో 


జిల్లేడు చెట్టు కింద ఉయ్యాలో                                       పుట్టినావే గంగ ఉయ్యాలో 


జిల జిల  కాలువలు ఉయ్యాలో                                    పారినవే గంగ ఉయ్యాలో 


ఉడుగు చెట్టు కింద ఉయ్యాలో                                      పుట్టినావే గంగ ఉయ్యాలో 


ఉరిము ఉరిమీ  కాలువలు ఉయ్యాలో                           పారినావే గంగ ఉయ్యాలో 


పట్టు అంచు చీరలు ఉయ్యాలో                                     తొడిగినావే గంగ ఉయ్యాలో 


ముత్యాల రవికలు ఉయ్యాలో                                        తొడిగినావే గంగ ఉయ్యాలో 


పుసినావు గంగ ఉయ్యాలో                                              పుట్టెడు బండారు ఉయ్యాలో 


బేరి కుంకుమ లోన  ఉయ్యాలో                                      కట్టినవే గంగ ఉయ్యాలో 


గంగ నువ్వు లేక ఉయ్యాలో                                            గడియ నిలువలెను ఉయ్యాలో 


గంగ నీకు శరణు ఉయ్యాలో                                           తల్లి నీకు శరణు ఉయ్యాలో’


For Audio click below.



Friday, 3 September 2021

Puliraju Gomatha Bathukamma Song | Old Telangana Bathukamma Song - by Ammamma TV

10:07 0 Comments

 కాశీలోన గలదమ్మ ఉయ్యాలో….. 

బ్రాహ్మణ్ణి ఇల్లు ఉయ్యాలో…..


బ్రాహ్మణ్ణి ఇంట్లోన  ఉయ్యాలో….. 

ఎంత చక్కని గోవు ఉయ్యాలో…..


పుట్టుతూ ఆ గోవు ఉయ్యాలో…..   
పురుడే గోరింది ఉయ్యాలో…..

పెరుగుతూ ఆ గోవు ఉయ్యాలో…..

పెండ్లే గోరింది ఉయ్యాలో…..


లేగయ్ కొన్నాళ్ళు ఉయ్యాలో…..

లేగల్లో మేసింది ఉయ్యాలో…..


ధుడై కొన్నాళ్ళు ఉయ్యాలో…..

దూడల్లో మేసింది ఉయ్యాలో…..


ఆవై  కొన్నాళ్ళు ఉయ్యాలో…..

ఆవుల్లో  మేసింది ఉయ్యాలో…..


ఏనూరు గట్లల్లో ఉయ్యాలో….. 

మేతకై వెళ్ళింది ఉయ్యాలో…..


ఎక్కారని గట్లన్నీ ఉయ్యాలో…..

ఎక్కెక్కి  మేసింది ఉయ్యాలో…..


దిగరాని గట్లన్నీ ఉయ్యాలో…..

దిగి దిగి మేసింది ఉయ్యాలో…..


పొదనున్న పులిరాజు ఉయ్యాలో…..

పొడమార్లి చూసిండు ఉయ్యాలో…..


మింగుతానే గోమాత ఉయ్యాలో…..

నిన్ను మింగుతానే ఉయ్యాలో…..


వద్దొద్దు పులిరాజు ఉయ్యాలో…..

నన్ను మింగకయ్య ఉయ్యాలో…..


వద్దొద్దు పులిరాజు ఉయ్యాలో…..

నన్ను మింగకయ్య ఉయ్యాలో…..


కొన్నాళ్ళు నేను  ఉయ్యాలో….. 

గొడ్డునై యుంటిని  ఉయ్యాలో…..


కోరి శివుణ్ణి మొక్కి  ఉయ్యాలో….. 

కొడుకుని కంటిని  ఉయ్యాలో…..


కొడుకు బసవని తోడు  ఉయ్యాలో….. 

వస్తాను పులిరాజా  ఉయ్యాలో…..


నీలాంటి మాటలు  ఉయ్యాలో…..  

చాలాగా వింటిని  ఉయ్యాలో…..


ముందటొచ్చే ఆవులారా ఉయ్యాలో….. 
ముచ్చవులారా  ఉయ్యాలో…..

మీరందరు వస్తుండ్రు ఉయ్యాలో….. 

మాయమ్మ ఏది ఉయ్యాలో…..


మీయమ్మ పులిరాజు ఉయ్యాలో…..

బాసలాడుతుండ్రు ఉయ్యాలో…..


నడుమొచ్చే ఆవులారా ఉయ్యాలో…..
నల్లావులారా ఉయ్యాలో…..


మీరందరు వస్తుండ్రు ఉయ్యాలో….. 

మాయమ్మ ఏది ఉయ్యాలో…..


మీయమ్మ పులిరాజు ఉయ్యాలో…..

బాసలాడుతుండ్రు ఉయ్యాలో…..


ఎనుకొచ్చే ఆవులారా ఉయ్యాలో…..

ఎర్రావులారా ఉయ్యాలో…..


మీరందరు వస్తుండ్రు ఉయ్యాలో….. 
మాయమ్మ ఏది ఉయ్యాలో…..

మీయమ్మ పులిరాజు ఉయ్యాలో…..

బాసలాడుతుండ్రు ఉయ్యాలో…..


పచ్చగడ్డి తోడు ఉయ్యాలో…..

వస్తాను పులిరాజా ఉయ్యాలో…..


సూర్యచంద్రుల ఉయ్యాలో…..

వస్తాను పులిరాజా ఉయ్యాలో…..


అప్పుడు పులిరాజా ఉయ్యాలో…..
సెలవిచ్చెనమ్మ ఉయ్యాలో…..

ఆనుండి గోమాత ఉయ్యాలో …..
పరుగు పరుగున వచ్చే ఉయ్యాలో…..

దొడ్డి చుట్టూ తిరిగింది ఉయ్యాలో….. 
దొడ్లోకి చూచింది ఉయ్యాలో…..

రారా నా కొడుకా ఉయ్యాలో….. 

పాలు తాగారా బసవ ఉయ్యాలో…..


అంబ అంటాడు ఉయ్యాలో …..

దగ్గరకే రాడు ఉయ్యాలో…..


బాసలాడిన పాలు ఉయ్యాలో …..

నాకొద్దు ఓయమ్మా ఉయ్యాలో…..


బాసలాడిన పాలు ఉయ్యాలో….. 
పుట్టల్లో పిండి ఉయ్యాలో…..

తాగారా బసవయ్య ఉయ్యాలో…..

పాలు తాగారా కొడుకా ఉయ్యాలో…..


వద్దొద్దు ఓయమ్మా ఉయ్యాలో….. 

ని పాలు నాకొద్దు ఉయ్యాలో…..


బాలీజూరికి  అమ్మితే ఉయ్యాలో…..
పోకురా న కొడుకా ఉయ్యాలో…..


ఉలిగడ్డ పోసేరు ఉయ్యాలో…..

ఊరంతా తిప్పేరు ఉయ్యాలో…..


గౌ0డ్లరికి అమ్మితే ఉయ్యాలో…..

పోకురా న కొడుకా ఉయ్యాలో…..


గంతలు కట్టేరు ఉయ్యాలో…..

గాన్గుళ్లు  తిప్పేరు ఉయ్యాలో…..


కాపోరికి అమ్మితే ఉయ్యాలో…..

పోకురా న కొడుకా ఉయ్యాలో…..


నాగళ్లు కట్టేరు  ఉయ్యాలో…..

నడకళ్ళు చూసేరు ఉయ్యాలో…..


మోటళ్లు  కట్టేరు ఉయ్యాలో…..

మోతైనా చూసేరు ఉయ్యాలో…..


ఎంత చక్కని ఎద్దాని ఉయ్యాలో…..

నీడన నిలిపేరు ఉయ్యాలో…..


పప్పు బెల్లం పెట్టి ఉయ్యాలో…..
సాకేరు నా కొడుకా ఉయ్యాలో…..

ఇన్ని బుద్దులు చెప్పి ఉయ్యాలో…..
ఎక్కడికి వెళ్తావమ్మా ఉయ్యాలో…..

ఆడిన మాటలు ఉయ్యాలో…..
తప్పొద్దు నా కొడుకా ఉయ్యాలో…..

ఆనుండి గోమాత ఉయ్యాలో …..

పులి యొద్దకెళ్లింది ఉయ్యాలో…..


మింగవయ్యా పులిరాజా ఉయ్యాలో…..

నన్ను మింగవయ్యా ఉయ్యాలో…..


నెత్తురు నేల పాలు  ఉయ్యాలో…..

కావొద్దు పులిరాజా ఉయ్యాలో…..


కండలు కాకులు పాలు ఉయ్యాలో…..
కావొద్దు పులిరాజా ఉయ్యాలో…..

చర్మము చెప్పుల పాలు ఉయ్యాలో…..

కావొద్దు పులిరాజా ఉయ్యాలో…..


మింగవయ్యా పులిరాజా ఉయ్యాలో…..

దిగ మింగావయ్యా ఉయ్యాలో…..


మింగుతూ పులిరాజా ఉయ్యాలో…..
మిన్నంటినాడు  ఉయ్యాలో…..

హర హర పులిరాజా ఉయ్యాలో …..

నెలకే ఒరిగిండు ఉయ్యాలో…..


పైనుండి పార్వతి  ఉయ్యాలో…..

పరమేశ చూసిండు  ఉయ్యాలో…..


జగతిలో ఈ  పాట ఉయ్యాలో…..

నిలిచెనోయమ్మా ఉయ్యాలో…..

For Audio click below