ఇద్దరు అక్క చెల్లెల్లు ఉయ్యాలో….
ఇద్దరు అక్క చెల్లెల్లు ఉయ్యాలో
ఒక్క ఊరికి ఇచ్చే ఉయ్యాలో
ఒక్కడే మా అన్న ఉయ్యాలో
వచ్చన్న పోడు ఉయ్యాలో
ఎట్లోత్తు చెల్లెలా ఉయ్యాలో
ఎరడ్డామాయే ఉయ్యాలో
ఏరుకి ఎంపళ్ళు ఉయ్యాలో
తలుపులడ్డామయే ఉయ్యాలో
తలుపులకి తాళాలు ఉయ్యాలో
వెండి సిలాలు ఉయ్యాలో
వెండి శిలలా కింద ఉయ్యాలో
వెలపత్తి చెట్టు ఉయ్యాలో
వెలపత్తి చెట్టుకి ఉయ్యాలో
ఏడే గింజలు ఉయ్యాలో
ఏడు గింజల పత్తి ఉయ్యాలో
తక్కెడు పత్తి ఉయ్యాలో
ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో
తక్కెడు పత్తి ఉయ్యాలో
పాల పాల పత్తి ఉయ్యాలో
పావురాళ్ల పత్తి ఉయ్యాలో
ముసల్ది వడికింది ఉయ్యాలో
ముత్యాల పత్తి ఉయ్యాలో
వయసమ్మ వడికింది ఉయ్యాలో
వన్నెల పత్తి ఉయ్యాలో
చిన్నారి వడికింది ఉయ్యాలో
చిన్నెల పత్తి ఉయ్యాలో
బాలింత వడికింది ఉయ్యాలో
బంగారు పత్తి ఉయ్యాలో
ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో
సాలోనికి ఇచ్చెనే ఉయ్యాలో
సంగడి సారన్నాఉయ్యాలో
సాగదియ్యబట్టే ఉయ్యాలో
నేసెనమ్మా సాలోడు ఉయ్యాలో
నెలకొక్క పోగు ఉయ్యాలో
దిగేనమ్మా ఆ చీర ఉయ్యాలో
దివిటీల మీద ఉయ్యాలో
ఆ చీర కట్టుక ఉయ్యాలో
కొంగళ్ల బాయికి ఉయ్యాలో
కొంగళ్ల బాయికి ఉయ్యాలో
నీళ్లకెళ్లినది ఉయ్యాలో
కొంగళ్ళన్నీ గూడి ఉయ్యాలో
కొంగు అంత చింపెను ఉయ్యాలో
ఆ చీర కట్టుక ఉయ్యాలో
హంసల్లా బాయికి ఉయ్యాలో
హంసల్లా బాయికి ఉయ్యాలో
నీళ్లకెళ్లినాది ఉయ్యాలో
హంసలన్నీ గూడి ఉయ్యాలో
అంచు అంత దూసెను ఉయ్యాలో
ఆ చీర కట్టుక ఉయ్యాలో
చిలకల బాయికి ఉయ్యాలో
చిలకల బాయికి ఉయ్యాలో
నీళ్లకెళ్లినది ఉయ్యాలో
చిలకలన్నీ గూడి ఉయ్యాలో
చింగులన్నీ చింపే ఉయ్యాలో
ఆ చీర కట్టుక ఉయ్యాలో
పట్నంబు పోయెనే ఉయ్యాలో
పట్నంబు పాయెనే ఉయ్యాలో
కొంగు బంగారము ఉయ్యాలో
దిగేనమ్మా ఆ చీర ఉయ్యాలో
దివిటీల మీద ఉయ్యాలో
అన్నరా ఓయన్న ఉయ్యాలో
అన్నరా పెద్దన్న ఉయ్యాలో
ఏడాదికి ఓసారి ఉయ్యాలో
బతుకమ్మ పండగ ఉయ్యాలో
ఆడపిల్లని అన్న ఉయ్యాలో
మరువకు ఓయన్న ఉయ్యాలో
కల్గెనే పెద్దన్న ఉయ్యాలో
కన్న తల్లివోలె ఉయ్యాలో
ఏడంత్రాలదే ఉయ్యాలో
తీరైన బతుకమ్మ ఉయ్యాలో
తీరైన బతుకమ్మ ఉయ్యాలో
పువ్వులెన్నో తెచ్చి ఉయ్యాలో
వారిద్దరూ ఉన్నారా ఉయ్యాలో
వీరిద్దరూ ఉన్నారా ఉయ్యాలో
సంవత్సరానికి ఉయ్యాలో
ఒక్కసారే తల్లి ఉయ్యాలో
తంగేడి పువ్వుల్ని ఉయ్యాలో
రాశిగా తెప్పించి ఉయ్యాలో
ఏడంత్రాలదే ఉయ్యాలో
తీరైన బతుకమ్మ ఉయ్యాలో …
పోయిరా బతుకమ్మ ఉయ్యాలో
పోయిరావమ్మ ఉయ్యాలో
మల్లి ఏడాదికి ఉయ్యాలో
మళ్లిరావమ్మా ఉయ్యాలో


No comments:
Post a Comment