రామ రామ రామ ఉయ్యాలో
రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
ముందుగా నిను తలుదు ఉయ్యాలో ముత్యాల పోచమ్మ ఉయ్యాలో
తరువాత నిను తలుదు ఉయ్యాలో తల్లిరో పెద్దమ్మ ఉయ్యాలో
ఆదిలో నిను తలుదు ఉయ్యాలో అయినోళ్ల మల్లన్న ఉయ్యాలో
కోరుత నిను తలుదు ఉయ్యాలో కొమరెల్లి మల్లన్న ఉయ్యాలో
మారుగా నిను తలుదు ఉయ్యాలో మావురాళ్ళ ఎల్లమ్మా ఉయ్యాలో
భోగాన నిను తలుదు ఉయ్యాలో బొంతపల్లి వీరన్న ఉయ్యాలో
శరణాన్న వరంగల్లు ఉయ్యాలో శంభుడా నిను తలుదు ఉయ్యాలో
రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
తొక్కుదును భూదేవి ఉయ్యాలో మొక్కుదును నేనిన్ను ఉయ్యాలో
బాధల్లా నిను తలుదు ఉయ్యాలో భద్రాద్రి రామన్నా ఉయ్యాలో
గుండెల్లో నిను తలుదు ఉయ్యాలో కొండగట్టు అంజన్న ఉయ్యాలో
ఎప్పుడు నిను తలుదు ఉయ్యాలో వేములాడ రాజన్న ఉయ్యాలో
యాదిలో నిను తలుదు ఉయ్యాలో యాదగిరి నరసన్న ఉయ్యాలో
సమ్మక్క సారక్క ఉయ్యాలో కీర్తిగా నిను తలుదు ఉయ్యాలో
కీర్తిగా నిను తలుదు ఉయ్యాలో కీసర రామన్న ఉయ్యాలో
రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
శ్రీరామ జయ రామ ఉయ్యాలో కోదండ రామ ఉయ్యాలో’
అందరిని తలచితి ఉయ్యాలో గంగ నిను మరచితి ఉయ్యాలో
గంగ నిను తలవంది ఉయ్యాలో గడియ నిలువలెను ఉయ్యాలో
మెతుకు చెట్టు కింద ఉయ్యాలో పుట్టినావే గంగ ఉయ్యాలో
మలమంటి కాలువలు ఉయ్యాలో పారినవే గంగ ఉయ్యాలో
తంగేడు చెట్టు కింద ఉయ్యాలో పుట్టినావే గంగ ఉయ్యాలో
తల్లేడు కాలువలు ఉయ్యాలో పారినవే గంగ ఉయ్యాలో
జిల్లేడు చెట్టు కింద ఉయ్యాలో పుట్టినావే గంగ ఉయ్యాలో
జిల జిల కాలువలు ఉయ్యాలో పారినవే గంగ ఉయ్యాలో
ఉడుగు చెట్టు కింద ఉయ్యాలో పుట్టినావే గంగ ఉయ్యాలో
ఉరిము ఉరిమీ కాలువలు ఉయ్యాలో పారినావే గంగ ఉయ్యాలో
పట్టు అంచు చీరలు ఉయ్యాలో తొడిగినావే గంగ ఉయ్యాలో
ముత్యాల రవికలు ఉయ్యాలో తొడిగినావే గంగ ఉయ్యాలో
పుసినావు గంగ ఉయ్యాలో పుట్టెడు బండారు ఉయ్యాలో
బేరి కుంకుమ లోన ఉయ్యాలో కట్టినవే గంగ ఉయ్యాలో
గంగ నువ్వు లేక ఉయ్యాలో గడియ నిలువలెను ఉయ్యాలో
గంగ నీకు శరణు ఉయ్యాలో తల్లి నీకు శరణు ఉయ్యాలో’


No comments:
Post a Comment