కాశీలోన గలదమ్మ ఉయ్యాలో…..
బ్రాహ్మణ్ణి ఇల్లు ఉయ్యాలో…..
బ్రాహ్మణ్ణి ఇంట్లోన ఉయ్యాలో…..
ఎంత చక్కని గోవు ఉయ్యాలో…..
పెరుగుతూ ఆ గోవు ఉయ్యాలో…..
పెండ్లే గోరింది ఉయ్యాలో…..
లేగయ్ కొన్నాళ్ళు ఉయ్యాలో…..
లేగల్లో మేసింది ఉయ్యాలో…..
ధుడై కొన్నాళ్ళు ఉయ్యాలో…..
దూడల్లో మేసింది ఉయ్యాలో…..
ఆవై కొన్నాళ్ళు ఉయ్యాలో…..
ఆవుల్లో మేసింది ఉయ్యాలో…..
ఏనూరు గట్లల్లో ఉయ్యాలో…..
మేతకై వెళ్ళింది ఉయ్యాలో…..
ఎక్కారని గట్లన్నీ ఉయ్యాలో…..
ఎక్కెక్కి మేసింది ఉయ్యాలో…..
దిగరాని గట్లన్నీ ఉయ్యాలో…..
దిగి దిగి మేసింది ఉయ్యాలో…..
పొదనున్న పులిరాజు ఉయ్యాలో…..
పొడమార్లి చూసిండు ఉయ్యాలో…..
మింగుతానే గోమాత ఉయ్యాలో…..
నిన్ను మింగుతానే ఉయ్యాలో…..
వద్దొద్దు పులిరాజు ఉయ్యాలో…..
నన్ను మింగకయ్య ఉయ్యాలో…..
వద్దొద్దు పులిరాజు ఉయ్యాలో…..
నన్ను మింగకయ్య ఉయ్యాలో…..
కొన్నాళ్ళు నేను ఉయ్యాలో…..
గొడ్డునై యుంటిని ఉయ్యాలో…..
కోరి శివుణ్ణి మొక్కి ఉయ్యాలో…..
కొడుకుని కంటిని ఉయ్యాలో…..
కొడుకు బసవని తోడు ఉయ్యాలో…..
వస్తాను పులిరాజా ఉయ్యాలో…..
నీలాంటి మాటలు ఉయ్యాలో…..
చాలాగా వింటిని ఉయ్యాలో…..
మీరందరు వస్తుండ్రు ఉయ్యాలో…..
మాయమ్మ ఏది ఉయ్యాలో…..
మీయమ్మ పులిరాజు ఉయ్యాలో…..
బాసలాడుతుండ్రు ఉయ్యాలో…..
మీరందరు వస్తుండ్రు ఉయ్యాలో…..
మాయమ్మ ఏది ఉయ్యాలో…..
మీయమ్మ పులిరాజు ఉయ్యాలో…..
బాసలాడుతుండ్రు ఉయ్యాలో…..
ఎనుకొచ్చే ఆవులారా ఉయ్యాలో…..
ఎర్రావులారా ఉయ్యాలో…..
మీయమ్మ పులిరాజు ఉయ్యాలో…..
బాసలాడుతుండ్రు ఉయ్యాలో…..
పచ్చగడ్డి తోడు ఉయ్యాలో…..
వస్తాను పులిరాజా ఉయ్యాలో…..
సూర్యచంద్రుల ఉయ్యాలో…..
వస్తాను పులిరాజా ఉయ్యాలో…..
రారా నా కొడుకా ఉయ్యాలో…..
పాలు తాగారా బసవ ఉయ్యాలో…..
అంబ అంటాడు ఉయ్యాలో …..
దగ్గరకే రాడు ఉయ్యాలో…..
బాసలాడిన పాలు ఉయ్యాలో …..
నాకొద్దు ఓయమ్మా ఉయ్యాలో…..
తాగారా బసవయ్య ఉయ్యాలో…..
పాలు తాగారా కొడుకా ఉయ్యాలో…..
వద్దొద్దు ఓయమ్మా ఉయ్యాలో…..
ని పాలు నాకొద్దు ఉయ్యాలో…..
ఉలిగడ్డ పోసేరు ఉయ్యాలో…..
ఊరంతా తిప్పేరు ఉయ్యాలో…..
గౌ0డ్లరికి అమ్మితే ఉయ్యాలో…..
పోకురా న కొడుకా ఉయ్యాలో…..
గంతలు కట్టేరు ఉయ్యాలో…..
గాన్గుళ్లు తిప్పేరు ఉయ్యాలో…..
కాపోరికి అమ్మితే ఉయ్యాలో…..
పోకురా న కొడుకా ఉయ్యాలో…..
నాగళ్లు కట్టేరు ఉయ్యాలో…..
నడకళ్ళు చూసేరు ఉయ్యాలో…..
మోటళ్లు కట్టేరు ఉయ్యాలో…..
మోతైనా చూసేరు ఉయ్యాలో…..
ఎంత చక్కని ఎద్దాని ఉయ్యాలో…..
నీడన నిలిపేరు ఉయ్యాలో…..
ఆనుండి గోమాత ఉయ్యాలో …..
పులి యొద్దకెళ్లింది ఉయ్యాలో…..
మింగవయ్యా పులిరాజా ఉయ్యాలో…..
నన్ను మింగవయ్యా ఉయ్యాలో…..
నెత్తురు నేల పాలు ఉయ్యాలో…..
కావొద్దు పులిరాజా ఉయ్యాలో…..
చర్మము చెప్పుల పాలు ఉయ్యాలో…..
కావొద్దు పులిరాజా ఉయ్యాలో…..
మింగవయ్యా పులిరాజా ఉయ్యాలో…..
దిగ మింగావయ్యా ఉయ్యాలో…..
హర హర పులిరాజా ఉయ్యాలో …..
నెలకే ఒరిగిండు ఉయ్యాలో…..
పైనుండి పార్వతి ఉయ్యాలో…..
పరమేశ చూసిండు ఉయ్యాలో…..
జగతిలో ఈ పాట ఉయ్యాలో…..
నిలిచెనోయమ్మా ఉయ్యాలో…..


No comments:
Post a Comment