Sukravaram Lakshmi Telangana Bathukamma Song - written by Kaloji Narayana Rao - by Ammamma TV
Ammamma TV
09:27
0 Comments
శుక్రవారం లక్ష్మి మా ఇంటికి వస్తే
శుక్రవారం లక్ష్మి మా ఇంటికి వస్తే
కుంకుమ భరణితో నేను ఎదురుకుందు
శనివారం లక్ష్మి మా ఇంటికి వస్తే
శెనగపూల రవికతో నేను ఎదురుకుందు
ఆదివారం లక్ష్మి మా ఇంటికి వస్తే
మల్లెపూల దండతో నేను ఎదురుకుందు
సోమవారం లక్ష్మి మా ఇంటికి వస్తే
సొమ్ములు పెట్టుకొని నేను ఎదురుకుందు
బుధవారం లక్ష్మి మా ఇంటికి వస్తే
బుక్కగుళాలతో నేను ఎదురుకుందు
గురువారం లక్ష్మి మా ఇంటికి వస్తే
గులాబీలతో నేను ఎదురుకుందు
శుక్రవారం లక్ష్మి మా ఇంటికి వస్తే
మా తల్లిదండ్రితో నేను ఎదురుకుందు
శనివారం లక్ష్మి మా ఇంటికి వస్తే
మా అత్తమామలతో నేను ఎదురుకుందు
ఆదివారం లక్ష్మి మా ఇంటికి వస్తే
అన్నావదినాలతో నేను ఎదురుకుందు
సోమవారం లక్ష్మి మా ఇంటికి వస్తే
మా అక్కబావ తో తో నేను ఎదురుకుందు
మంగళ వారం లక్ష్మి మా ఇంటికి వస్తే
తమ్ముడు మరదలుతో నేను ఎదురుకుందు
బుధవారం లక్ష్మి మా ఇంటికి వస్తే
బిడ్డలు అల్లుళ్లతో నేను ఎదురుకుందు
గురువారం లక్ష్మి మా ఇంటికి వస్తే
మా చెల్లెమరిదితో తో నేను ఎదురుకుందు

