Tuesday, 5 October 2021

Kalavari Kodalu (Bathukamma Song) - by Ammamma TV

కలవారి కోడలు ఉయ్యాలో

కలవారి కోడలు ఉయ్యాలో                కలికి కామాక్షి ఉయ్యాలో
కడుగుతున్నది పప్పు ఉయ్యాలో           కడవల్లో బోసి ఉయ్యాలో
అప్పుడే వచ్చాడు ఉయ్యాలో              ఆమె పెద్దన్న ఉయ్యాలో

కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో              కన్నీరు తుడిచింది  ఉయ్యాలో

ఏమమ్మా చెల్లెల్ల ఉయ్యాలో               ఏమి కష్టాలు ఉయ్యాలో 

తుడుచుకో కన్నీరు ఉయ్యాలో             ముడుచుకో కురులను ఉయ్యాలో

వెళ్లి వస్తానని ఉయ్యాలో                 చెప్పి రావే తల్లి ఉయ్యాలో 
పట్టె మంచం మీద ఉయ్యాలో            పవళించు మామ ఉయ్యాలో

మాఅన్నలొచ్చారు  ఉయ్యాలో            మమ్మంపు తార ఉయ్యాలో

మీ అన్నలు వస్తేను  ఉయ్యాలో          నీకేమి తెచ్చిరి ఉయ్యాలో 

నాకు నల్ల చీర ఉయ్యాలో               నెమలి అంచు రైక ఉయ్యాలో 

పాపడికి పట్టు అ0గి ఉయ్యాలో            పాలు త్రాగే గిన్నె ఉయ్యాలో 
పాపడికి పట్టు అ0గిఉయ్యాలో             పాలు త్రాగే గిన్నె ఉయ్యాలో 
అట్లయితే నేనెరుగ ఉయ్యాలో             మీఅత్తని అడుగమ్మా ఉయ్యాలో

అరుగుల్లా కూసున్న ఉయ్యాలో            ఓ అత్తగారు ఉయ్యాలో 
అరుగుల్లా కూసున్న ఉయ్యాలో            ఓ అత్తగారు ఉయ్యాలో 
మాఅన్నలొచ్చారు ఉయ్యాలో              మమ్మంపు తార ఉయ్యాలో
మాఅన్నలొచ్చారు ఉయ్యాలో              మమ్మంపు తార ఉయ్యాలో
మీ అన్నలు వస్తేను  ఉయ్యాలో           నీకేమి తెచ్చిరి ఉయ్యాలో 
మీ అన్నలు వస్తేను  ఉయ్యాలో           నీకేమి తెచ్చిరి ఉయ్యాలో 
నాకు నల్ల చీర ఉయ్యాలో                నెమలి అంచు రైక ఉయ్యాలో 
నాకు నల్ల చీర ఉయ్యాలో                నెమలి అంచు రైక ఉయ్యాలో  
పాపడికి పట్టు అ0గి ఉయ్యాలో            పాలు త్రాగే గిన్నె ఉయ్యాలో 
పాపడికి పట్టు అ0గిఉయ్యాలో             పాలు త్రాగే గిన్నె ఉయ్యాలో 
అట్లయితే నేనెరుగ ఉయ్యాలో             మీబావని అడుగమ్మా ఉయ్యాలో 
అట్లయితే నేనెరుగ ఉయ్యాలో             మీ బావని అడుగమ్మా ఉయ్యాలో 
భారతం చదివేటి ఉయ్యాలో              ఓ బావగారు ఉయ్యాలో 
మాఅన్నలొచ్చారు ఉయ్యాలో             మమ్మంపు తార ఉయ్యాలో
మాఅన్నలొచ్చారు ఉయ్యాలో             మమ్మంపు తార ఉయ్యాలో 
మీ అన్నలు వస్తేను ఉయ్యాలో           నీకేమి తెచ్చిరి ఉయ్యాలో 
మీ అన్నలు వస్తేను  ఉయ్యాలో          నీకేమి తెచ్చిరి ఉయ్యాలో
నాకు నల్ల చీర ఉయ్యాలో               నెమలి అంచు రైక ఉయ్యాలో 
నాకు నల్ల చీర ఉయ్యాలో               నెమలి అంచు రైక ఉయ్యాలో  
పాపడికి పట్టు అ0గి ఉయ్యాలో           పాలు త్రాగే గిన్నె ఉయ్యాలో 
పాపడికి పట్టు అ0గిఉయ్యాలో            పాలు త్రాగే గిన్నె ఉయ్యాలో 
అట్లయితే నేనెరుగ ఉయ్యాలో            మీ అక్కనడుగుమ్మా ఉయ్యాలో 
వంటలు చేసేటి తల్లి  ఉయ్యాలో        ఓ అక్క గారు ఉయ్యాలో 
వంటలు చేసేటి తల్లి  ఉయ్యాలో        ఓ అక్క గారు ఉయ్యాలో  
మాఅన్నలొచ్చారు ఉయ్యాలో            మమ్మంపు తార ఉయ్యాలో
మీ అన్నలు వస్తేను  ఉయ్యాలో         నీకేమి తెచ్చిరి ఉయ్యాలో 
మీ అన్నలు వస్తేను  ఉయ్యాలో         నీకేమి తెచ్చిరి ఉయ్యాలో
నాకు నల్ల చీర ఉయ్యాలో              నెమలి అంచు రైక ఉయ్యాలో 
పాపడికి పట్టు అ0గి ఉయ్యాలో          పాలు త్రాగే గిన్నె ఉయ్యాలో 
పాపడికి పట్టు అ0గిఉయ్యాలో           పాలు త్రాగే గిన్నె ఉయ్యాలో 
అట్లయితే నేనెరుగ ఉయ్యాలో          నీభర్త అడుగమ్మా ఉయ్యాలో 
రచ్చలో కూచున్న ఉయ్యాలో          రాజేంద్రభోగి ఉయ్యాలో
రచ్చలో కూచున్న ఉయ్యాలో          రాజేంద్రభోగి ఉయ్యాలో 
మాఅన్నలొచ్చారు ఉయ్యాలో          మమ్మంపు తార ఉయ్యాలో
మీ అన్నలు వస్తేను  ఉయ్యాలో       నీకేమి తెచ్చిరి ఉయ్యాలో 
నాకు నల్ల చీర ఉయ్యాలో            నెమలి అంచు రైక ఉయ్యాలో 
పాపడికి పట్టు అ0గి ఉయ్యాలో         పాలు త్రాగే గిన్నె ఉయ్యాలో 
కట్టుకో చీరలు. ఉయ్యాలో            పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో

పుట్టింటికి నీవు ఉయ్యాలో            సుఖముగా పోయిరా ఉయ్యాలో 

 For Audio click below.

No comments:

Post a Comment