Saturday, 2 October 2021

Chithu Chithula Bomma (Bathukamma Song) - by Ammamma TV

       చిత్తు చిత్తులబొమ్మ శివుని ముద్దుల గుమ్మ       

  చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
   చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

రాగి బిందె తీస్క… రమణి నీళ్ళకు బోతే
 రాములోరు ఎదురాయేనమ్మో… ఈ వాడలోన
   చిత్తూ చిత్తుల బొమ్మ… శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో… ఈ వాడలోన

వెండి బిందె తీస్క… వెలది నీళ్ళకు బోతే
వెంకటేశుడెదురాయే నమ్మో… ఈ వాడలోన
   చిత్తూ చిత్తుల బొమ్మ… శివుని ముద్దుల గుమ్మ
  బంగారు బొమ్మ దొరికెనమ్మో… ఈ వాడ లోన

  బంగారు బిందె తీస్క… బామ్మ నీళ్ళకు బోతే
భగవంతుడెదురాయే నమ్మో… ఈ వాడలోన
  చిత్తూ చిత్తుల బొమ్మ… శివుని ముద్దుల గుమ్మ
 బంగారు బొమ్మ దొరికెనమ్మో… ఈ వాడ లోన

పగిడి బిందె తీస్క… పడతి నీళ్ళకు బోతే
పరమేశుడెదురాయే నమ్మో… ఈ వాడలోన
    చిత్తూ చిత్తుల బొమ్మ… శివుని ముద్దుల గుమ్మ
  బంగారు బొమ్మ దొరికెనమ్మో… ఈ వాడ లోన

  ముత్యాల బిందె తీస్క… ముదిత నీళ్ళకు బోతే
ముద్దుకృష్ణుడెదురాయే నమ్మో… ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ… శివుని ముద్దుల గుమ్మ
చిత్తూ చిత్తుల బొమ్మ… శివుని ముద్దుల గుమ్మ

For Audio click below.

No comments:

Post a Comment