Tuesday, 5 October 2021

Okkesi yelagapande gauramma - Gauramma Song (Bathukamma Song) - by Ammamma TV

ఒక్కేసి ఎలగపండే గౌరమ్మ


ఒక్కేసి ఎలగపండే గౌరమ్మ         
దురాన దోరపండే గౌరమ్మ
దురాన దొరలైరి గౌరమ్మ            
పట్నాన పంతులైరి గౌరమ్మ 
అది చూసి మా అన్నలు గౌరమ్మ    
ఏడు మేడలు ఎక్కిరి గౌరమ్మ
 
ఏడు మేడలెక్కి ఎత్తులు దాటంగా ఎదుర్కోలు ఇయ్యంగా 
 
ఒక్కేసి ఎలగపండే గౌరమ్మ         
దురాన దోరపండే గౌరమ్మ
ఒక్కేసి ఎలగపండే గౌరమ్మ         
దురాన దోరపండే గౌరమ్మ
ఒక్కేసి ఎలగపండే గౌరమ్మ         
దురాన దోరపండే గౌరమ్మ
దురాన దొరలైరి గౌరమ్మ            
పట్నాన పంతులైరి గౌరమ్మ 
అది చూసి మా అన్నలు గౌరమ్మ    
ఏడు మేడలు ఎక్కిరి గౌరమ్మ
 
ఏడు మేడలెక్కి ఎత్తులు దాటంగా ఎదుర్కోలు ఇయ్యంగా 

దొంగలెవరో దోచిరి గౌరమ్మ          
బంగారు గుండ్ల వనమే గౌరమ్మ
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ       
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ 

 భారతి దేవివై బ్రహ్మకి ఇల్లాలివై పార్వతి దేవివై పరమేశురాలివై 
 
పరిగ శ్రీ లక్ష్మివై గౌరమ్మ            
భార్యవైతివి హరికి గౌరమ్మ  
ఒక్కేసి ఎలగపండే గౌరమ్మ         
దురాన దోరపండే గౌరమ్మ 
 
ఎన్నెన్నో రూపాలు ఏడేడు లోకాలు ఉన్న జనులకు కొరికేలు అన్ని సమకూర్చగా 
 
కన్నా తల్లివైతివి గౌరమ్మ           
కామధేనువైతివి గౌరమ్మ    
ఒక్కేసి ఎలగపండే గౌరమ్మ        
దురాన దోరపండే గౌరమ్మ
 
ముక్కోటిదేవతలు సక్కనికాంతలు ఎక్కువ నిను గూర్చి పెక్కు నోములు నోమి
 
 
ఎక్కువ వారైరిగా గౌరమ్మ        
ఈ లోకమున నుండి గౌరమ్మ     
ఒక్కేసి ఎలగపండే గౌరమ్మ        
దురాన దోరపండే గౌరమ్మ
 
తమరి కంటే ఎక్కువ దైవంబు ఎవరు లేరు తమకింపు గుర్తింపు సకల లోకంబుల
 
 
సమఉజ్జి పాలించగా గౌరమ్మ       
కన్నుల పండుగాయే గౌరమ్మ 
ఒక్కేసి ఎలగపండే గౌరమ్మ        
దురాన దోరపండే గౌరమ్మ

For Audio click below.



 








No comments:

Post a Comment