Tuesday, 5 October 2021

RamaRama Uyyalo (Bathukamma Song) version02 - by Ammamma TV

రామ రామ ఉయ్యాలో 

రామ రామ ఉయ్యాలో                 
రామనే శ్రీరామ ఉయ్యాలో 
రామ రామ ఉయ్యాలో                 
రామనే శ్రీరామ ఉయ్యాలో 
రామ రామ నంది ఉయ్యాలో            
రాగమేత్తరాదు ఉయ్యాలో  
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో          
నెలవన్నెకాడ ఉయ్యాలో    
పాపట్ల చంద్రుడా ఉయ్యాలో            
బాలాకుమారుడా ఉయ్యాలో    
పెద్దలకు వచ్చింది ఉయ్యాలో           
పెత్తరామాస ఉయ్యాలో    
బాలలకు వచ్చింది ఉయ్యాలో           
బతుకమ్మ పండుగ ఉయ్యాలో  
తెల్ల తెల్లయి గుళ్ళు ఉయ్యాలో          
తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో  
పన్నెండ్లనాడు గుళ్ళు ఉయ్యాలో         
పాడుబడ్డ గుళ్ళు ఉయ్యాలో  
తెల్లయీ వేములవాడ ఉయ్యాలో          
రాజన్న గుళ్ళు ఉయ్యాలో
నల్ల నల్లని  గుళ్ళు ఉయ్యాలో           
నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో
నల్ల నల్లని  గుళ్ళు ఉయ్యాలో           
నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో
నల్ల నల్లని  గుళ్ళు ఉయ్యాలో           
నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో
నల్లయీ నల్లగొండ ఉయ్యాలో            
నరసింహ గుళ్ళు ఉయ్యాలో
నల్లయీ నల్లగొండ ఉయ్యాలో            
నరసింహ గుళ్ళు ఉయ్యాలో
పచ్చ పచ్చయీ గుళ్ళు ఉయ్యాలో        
పచ్చయమ్మ గుళ్ళు ఉయ్యాలో
పచ్చయీ పరకాన ఉయ్యాలో            
మల్లన గుళ్ళు ఉయ్యాలో
పచ్చయీ పరకాన ఉయ్యాలో            
మల్లన గుళ్ళు ఉయ్యాలో
పర్వతాల మల్లన ఉయ్యాలో            
పదములు సెలవయ్య ఉయ్యాలో
పర్వతాల మల్లన ఉయ్యాలో            
పదములు సెలవయ్య ఉయ్యాలో
రామ రామ రామ ఉయ్యాలో             
రామనే శ్రీరామ గుళ్ళు ఉయ్యాలో 




For Audio click below.








  
 
 
 
              

No comments:

Post a Comment